ఆకేరు వాగు శాపం బిఆర్ఎస్, బిజెపి పార్టీదే….
Warangalసొమ్మొకరిది సోకొకరిదిలా మాజీ మంత్రి పోకడలు..నిండుకుండలా ఎస్సారెస్పీ ఫీడర్ ఛానల్…ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన ఎమ్మెల్యే నాగరాజు .కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం రైతు కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.గతంలో ఏదైతే రైతులకు మాట ఇచ్చినట్లే SRSP నీటిని తెప్పించిన ఘనత వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు…వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోళ్ళకల్లు గ్రామ ఆకేరు వాగు పరివాహక ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించేందుకు వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మండలంలోనీ కెనాల్ కాలువలను సందర్శించారు. ఈ సందర్శనలో ఉప్పరపల్లి గ్రామం నుండి కెనాల్ ద్వారా L పాయింట్ నుండి రోలకల్లు రావూరు గ్రామాల మీదుగా ప్రవహించే ఆకేరు వాగులోకి సాగునీరు నిరంతరంగా అందేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు…రైతులకు నీటి కొరత సమస్య తలెత్తకుండా ఉండేందుకు, ఎస్సారెస్పీ లేబర్తి ,బొక్కల గూడెం గ్రామాలలో కాలువలకు స్వంత ఖర్చుతో మిషన్ తెప్పించి కాలువలను శుభ్రపరిచి నీటి ప్రవాహాన్ని మెరుగుపరిచేలా చర్యలు చేపట్టారు. దీంతో, ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సమృద్ధిగా నీరు ఈరోజు అందుతుంది…వర్ధన్నపేట కోనారెడ్డి చెరువుకు ఫీడర్ ఛానల్ ద్వారా వెళ్లే మార్గంలోన కాలువను శుభ్రం చేయించారు ,srsp కెనాల్ కాలువలో కొన్ని ప్రాంతాల్లో మట్టి కట్టలు ఏర్పడటం వల్ల వర్ధన్నపేట నియోజకవర్గం వైపు నీటి ప్రవాహం సరిగ్గా జరగడం లేదని గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, స్వంత ఖర్చుతో హిటాచి మెషిన్ ఏర్పాటు చేసి, ఆ మట్టికట్టలను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కృషితో, నీటి ప్రవాహం పునరుద్ధరించబడింది మరియు రైతులకు సాగునీరు నిరాటంకంగా అందే పరిస్థితి ఏర్పడింది..ఎమ్మెల్యే నాగరాజు గార్ల కృషి వల్ల కాలువల ద్వారా నీరు నిరంతరాయంగా అందుతుందన్న ఆనందంతో, స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని, తక్షణ చర్యలు తీసుకున్నందుకు ఎమ్మెల్యే కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతుల సంక్షేమానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామన్న సంకల్పాన్ని ఎమ్మెల్యే నాగరాజు వ్యక్తం చేశారు…..