ఆదర్శప్రాయుడు ఆవుల వెంకయ్య
Suryapetకోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు తండ్రి అయిన ఆవుల వెంకయ్య ఆదర్శప్రాయుడని కోదాడ పట్టణ ప్రముఖులు పలువురు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని వారి నివాసంలో జరిగిన15 వ వర్ధంతి కార్యక్రమంలో పలువురు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అవుల వెంకయ్య పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి పేరును పది కాలాలపాటు ప్రజల్లో నిలిచిపోయే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీపతి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు పైడిమర్రి వెంకటనారాయణ, కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తూనం కృష్ణ, కోశాధికారి యలగందుల నరసయ్య, మాజీ అధ్యక్షులు గుండపునేని నాగేశ్వరరావు, మాజీ కార్యదర్శి విలాస కవి నరసరాజు, ప్రముఖ న్యాయవాది పాలేటి నాగేశ్వరరావు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బుడిగం నరేష్, డైరెక్టర్లు గుండపునేని ప్రభాకర్ రావు, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, ఎల్డర్స్ రిక్రియేషన్ సొసైటీ సహాయ కార్యదర్శి జాకీర్, కోశాధికారి తోట రంగారావు, ఆవుల రంగారావు తదితర ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు