తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని లక్ష్యంతో మునగాల మండలం పరిధిలోని పలు గ్రామాలతో పాటు తాడ్వాయి గ్రామంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సహకారం ఆరోగ్య ఉప కేంద్రం మంజూరు చేయడం పట్ల తాడ్వాయి గ్రామంలో శనివారం పత్రిక ప్రకటనలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కొల ఆంజనేయులు హర్షం వ్యక్తం చేస్తూ అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కార్పొరేట్ స్థాయిలో ప్రతి పేదవాడికి వైద్య అందించాలని ఉద్దేశం తో గ్రామీణప్రాంతంలో ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల గ్రామ ప్రజలు పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.