ఆర్టిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ కు డాక్టరేట్
Uncategorizedగళం న్యూస్ రంగారెడ్డి
రాష్ట్రంలో అనేక విద్యార్థి ఉద్యమాలకు మరియు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి పేద విద్యార్థులు అభ్యున్నతి కోసం పాటుపడిన సోషల్ యాక్టివిస్ట్ చంటి ముదిరాజ్ కు సోషల్ సర్వీస్ విభాగంలో డాక్టరేట్ పట్టా పొందారు. చంటి ముదిరాజ్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్జీవోలో పనిచేస్తూ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ టెక్సాస్ యు.ఎస్.ఎ చంటి ముదిరాజ్ చేసిన సంఘ సేవ, సామాజిక సేవకు గుర్తించిన
డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ టెక్సాస్ యు.ఎస్.ఎ విశ్లేషించి గౌరవప్రదంగా ఆయనకి డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.. హైదరాబాదులో సోమవారం జరిగిన కార్యక్రమంలో చంటి ముదిరాజ్ కు డాక్టరేట్ అందించారు.సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే చంటి ముదిరాజ్ ప్రతి ఒక్కరికీ మానవ దృక్పథంలో తనవంతు సాకారం చేస్తూనే ఉంటారు. అటు ఆర్టీఐ సంస్థతో విధ్యారులకు విద్య పరంగా, ప్రజలకు, మహిళలకు అనేక రంగాల్లో సహాయాలు అందిస్తున్నారు. ఇవన్నీ గమనించిన డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ టెక్సాస్ యు.ఎస్.ఎ విశ్లేషకులు దాదాపు 3 సం”లు విశ్లేషించి గౌరవప్రదంగా ఆయనకి డాక్టరేట్ పట్టాకు సరైన అర్హుడని ప్రకటించారు… హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవం పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సేవలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ అవార్డు పొందడం పట్ల ఆయన అభిమానులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్,ఆర్టీఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురాస్రవంతి,కిషోర్ వర్మ,సృజన,గుండెల రాయుడు తదితరులు పాల్గొన్నారు.