ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ దేశ ప్రజలకు 77 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఐకమత్యం గా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాపోలు లింగస్వామి, యాదాద్రి జిల్లా ప్రెసిడెంట్ నాగం మధు, ఐతరాజు అశోక్,రోశనగరి యాదయ్య, బుగ్గ రాములు,అంజయ్య, గంజి శివకుమార్, కత్తుల రవి, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *