ఆశ్రమ పాఠశాల హెచ్ఎం ని సస్పెండ్ చేయాలి: PDSU
Bhadradri Kothagudemవిద్యార్థినిలు తో HM పని పనిచేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన
పై అధికారులు షోకాస్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం మానుకోవాలి
అధికారుల పరివేక్షణ లోపం గా కనిపిస్తుంది
చర్యలు తీసుకోవాలని PDSU డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ డిమాండ్
PDSU డివిజన్ కమిటీ సమావేశం జరిగింది అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలం గౌరారం గ్రామంలో ST ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలతో క్లాస్ రూములు మరియు స్కూలు ఆవరణం లో ఉన్న చెత్తాచెదారాన్ని చీపుర్లతో ఊడుస్తూ ప్రతిరోజు కనబడుతున్నారు ,విద్యార్థుల తల్లిదండ్రులు కాయకష్టం చేసి హాస్టల్లోనికి విద్యార్థుల్ని పంపిస్తే విద్యార్థులతో హాస్టల్ లో పనులు చేస్తున్నారు చదువు కోసం వచ్చిన విద్యార్థులతో చదువు చెప్పకుండా స్కావెంజర్ చేసే పని హాస్టల్లో వర్కర్ చేసే పనులను విద్యార్థులతో చేయించడం చాలా దుర్మార్గమైన చర్య అనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . విద్యార్థులు పాఠశాలలకు వచ్చింది పనిచేయడానికి లేదా చదువుకోడానికా అన్నది అర్థం కాని పరిస్థితి దీనికి సమాధానం సంబంధిత అధికారులు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ఆశ్రమ పాఠశాలలో ప్రతిరోజు ఒక క్లాసు పిల్లలు క్లాస్ రూమ్ లో శుభ్రం చేయాలని ఆదేశాలు ఇచ్చారని , విద్యార్థులు సమస్యలు చెప్తే విద్యార్థుల్ని బెదిరిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఐటిడిఏ అధికారులు స్పందించాలాలని ఇలాంటి సమస్యలు బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా విద్యార్థి సంఘాలని రాజకీయ నాయకులను మీడియా మిత్రులను రానివ్వ కుడాదని ఆదేశాలు జారీ చేస్తున్నారని అన్నారు. ఈ సమస్యలపై అధికారులు సమాధానం చెప్పాలని HM ని సస్పెండ్ చేయాలని PDSU గా డిమాండ్ చేస్తున్నామని భవిష్యత్తు లొ సమస్యల పరిష్కారం కాకుంటే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ప్రభుత్వాన్ని అధికారుల్ని హెచ్చరించారు