తెలుగు ఈ69 న్యూస్, పరకాల, సెప్టెంబర్ 15:హనమకొండ జిల్లా: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ (ఐఏపి) వరంగల్ జిల్లా (హనమకొండ) కొత్త అధ్యక్షుడిగా డా.రోహిత్ సాదు తెలంగాణ రాష్ట్ర ఐఏపి అధ్యక్షుడు డా.పూర్ణచంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించి, శాలువాతో సత్కరించారు.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా దక్షిణ జోన్ సీఈసీ లీడర్ డా.అంజని కుమార్,రాష్ట్ర అధ్యక్షుడు డా.పూర్ణచంద్రశేఖర్,ఐఏపి మంచిర్యాల్ జిల్లా అధ్యక్షుడు డా.ఆకుల అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.తరువాత కొత్త కమిటీ సభ్యులను పరిచయం చేసి శాలువాలతో సత్కరించారు.నూతన కమిటీ సభ్యులు:డా.రంధీర్ మడిశెట్టి,డా.సమ్రాట్,డా.రామకృష్ణ ఎం. డా.నాగేశ్ బాబు,డా.రాకేష్ మేకల,డా.గంప శ్రీనాథ్,డా.వెంకటేశ్వరరావు,డా.హరీష్,డా.వెంకన్న,డా.బండి ప్రవలిక,డా.ఎమ్మడి మౌనిక,డా.కిరణ్,డా.శేఖర్,డా.వంశీధర్,డా. ఉమాశంకర్,డా.బాసిత్,డా.నిఖిల,డా. మధు గౌడ్,డా.సాయికుమార్ కోత,డా.బాలకృష్ణ,డా.కళ్యాణ్,డా.ప్రీతీ,డా.షాజియా ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఫిజియోథెరపిస్టులు పాల్గొని కొత్త నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.