ఇస్త్రీ దుకాణం కూల్చిన చోటే పునర్నిర్మానం చేయించిన రజక వృత్తిదారుల సంఘం
Hyderabadతేదీ:3-1-2023(మంగళవారం) ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ నల్లకుంట పద్మాకాలనీలో కొలిపాక నరేష్ గత కొంతకాలంగా అదే కాలనీలోని ఉషోదయ పార్కు ప్రక్కన ఫుట్ పాత్ స్థలంలో పది సంవత్సరాల నుంచి ఇస్త్రీ దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని కాలనీలు ప్రజలందరికీ ఇస్త్రీ చేయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి నరేష్ లాండ్రీ దుకాణాన్ని అదే కాలనీలోని కొంతమంది కావల్చుకొనిGHMC అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయడంతో ముందస్తు సమాచారం లేకుండానే అధికారులు వచ్ఛి ఇస్తిరి షాపుని కూల్చి వేయడం జరిగింది. ఈ సమస్య పైన గ్రేటర్ హైదరాబాద్ రజక వృత్తిదారుల సంఘం సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో GHMCఉన్నత అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇస్త్రీ షాపు కూల్చివేసిన సంఘటన పైన ఫిర్యాదులు చేయడం, మాట్లాడడం జరిగింది. వెంటనే మేల్కొన్న జిహెచ్ఎంసి అధికారులు కూల్చిన చోటే ఇస్త్రీ దుకాణం నిర్మింణాకి అనుమతులు ఇచ్చారు. ఉనత అధికారులకు ఫిర్యాదు చేయగా తిరిగి యాద స్థలంలో లాండ్రీ షాప్ నిర్మాణం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్, పాల్గొని మాట్లాడుతూ జీ.వో నెంబర్ 18,19 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ ,పట్టణాలలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలలో ఇస్త్రి షాపులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోలని సక్రమంగా అమలు చేయాలని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. జిహెచ్ఎంసి అధికారులు ఇప్పటికైనా రజక వృత్తిదారుల జీవనోపాధి అయినటువంటి ఇస్త్రీ దుకాణాల కూల్చివేసే చర్యలకు దిగకూడదని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత అధికారులకు ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష /కార్యదర్శులు ch వెంకటస్వామి, యం.గోపాల్, నరసయ్య ,బిక్షపతి కుమార్ భాగ్యలక్ష్మి,యాకయ్య యాదగిరి ,వెంకన్న లక్ష్మి ,సాయి, జ్యోతి పవన్ తదితరులు పాల్గొన్నారు.