ఈ నెల 16న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన
Jangaonసీఎం చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
శాఖల వారీగా సంబంధిత పనులను వేగవంతం చేయాలి
సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులందరూ సహకరించాలి
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులకు సూచించారు.ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో దాదాపు 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్,(రెవెన్యూ) రోహిత్ సింగ్,డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆర్డీఓలు,జిల్లా అధికారులు,పోలీసు అధికారులు,ఇతర సంబంధిత శాఖల అధికారులతో జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దాదాపు 800 కోట్ల రూపాయలతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని,అందుకు సంబంధించిన వాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు.వంద పడకల ఆసుపత్రి,యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల,ప్రభుత్వ డిగ్రీ కళాశాల,బంజారా భవన్,సమీకృత రెవెన్యూ డివిజన్ కార్యాలయ సముదాయం,విద్యుత్ డివిజన్ కార్యాలయం,5 సబ్ స్టేషన్లు,ఏడు మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్లు,పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరైన రోడ్లకు,చిల్పూర్,వేలేరు మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలకు,ఆయిల్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్,బంజారా భవన్,ఐటీడీఏ రోడ్ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని,అలాగే స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ లక్షణం ప్రారంభించినట్లు తెలిపారు.ఇందుకు గాను ప్రణాళికాబద్ధంగా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.వీటితో పాటు మహిళా సాధికారత దిశగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సౌర విద్యుత్ ప్లాంట్,ఆర్టీసీ బస్సులు,పెట్రోల్ బంక్ లకు శంకుస్థాపనకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం,శంకుస్థాపనలు చేయడానికి మొట్టమొదటిసారిగా పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.స్టేషన్గన్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో జఫర్గడ్ రోడ్ లోని ఫ్లై ఓవర్ కలరింగ్,రైల్వే అండర్ పాస్ రోడ్డు మరమ్మతు పనులు,అంబేద్కర్ సర్కిల్ సుందరీకరణలు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఆయా పనులను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని వెల్లడించారు.అలాగే తగు జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని,ఈ పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపిరామ్,వెంకన్న,ఏసీపీ భీం శర్మ, పీడీ డిఆర్డిఓ వసంత,డిఏంహెచ్ఓ మల్లికార్జున రావు,డిపిఓ స్వరూప,హౌసింగ్ పీడీ మాతృ నాయక్, విద్యుత్ ఎస్ఈ వేణుమాధవ్, వివిధ శాఖల జిల్లా అధికారులు,ఇంజనీరింగ్ శాఖ అధికారులు,పోలీసు అధికారులు,తహసీల్దార్లు,ఇతర సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.