గండుగులపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులతో సమీక్షాసమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఎమ్మెల్యేజారె ఆదినారాయణ మాట్లాడుతూ తను చిన్నతనంలో ఈ పాఠశాలలోనే చదువుకున్నానని తను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ రోజుల్లో చదువుచెప్పిన గురువుల ప్రోత్సహం చాలా విలువైనదని తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు.అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు పాటలు భోదించే సమయంలో పాఠశాల విధినిర్వహణలో ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితులలో కూడా సెల్ ఫోన్ ఉపయోగించవద్దని అందువల్ల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఈ రోజు నుంచి ఇది వర్తిస్తుందని అత్యవసరం అయితే తప్ప మిగిలిన సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించవద్దని ముందుగా గండుగులపల్లి అన్ని ప్రభుత్వ పాఠశాలలనుంచే ఈ కార్యక్రమం మొదలు పెట్టానని తెలిపి ఉపాధ్యాయులతో సెల్ ఫోన్ వాడాభోమని తీర్మానం చేపించారు.నియోజకవర్గంలో ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పని చేసి ఉత్తమ ఫలితాలు సాధించి నియోజకవర్గాన్ని విధ్యారంగంలో ముందుంచాలని విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే క్షమించేది లేదని తెలియజేసారు.ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.