ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం లో కడియం
Jangaonతెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి గారు….. స్టేషన్ ఘనపూర్ మండలం, నమిలిగొండ గ్రామ శివారు నందు కడియం ఫౌండేషన్ వారి అధ్వర్యంలో నిర్వహించబడిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి
విశిష్ట అతిధి గా జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, పాగాల సంపత్ రెడ్డి గారు, గౌరవ అతిధిగా మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారామ్ నాయక్ గారు హాజరై గెలుపొందిన జట్లకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల పి.ఏ.సి.ఎస్ చైర్మన్ లు, సర్పంచులు, యం.పి.టి.సి.లు మరియు ఇతర నాయకులు పెద్ద ఎత్తున హాజరైనారు. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ….
మన రాష్ట్ర ముఖ్య మంత్రి గౌ. కె.సి.అర్ గారి చొరవతో ప్రతీ నియోజకవర్గంలో ఒక స్టేడియం మరియు ప్రతీ గ్రామములో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
స్టేషన్ ఘనపూర్ మండలం కేంద్రంలో కూడా స్టేడియం మంజూరైందని దాని పనులు పూర్తి కావాల్సిఉందన్నారు. తమ కడియం ఫౌండేషన్ ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటుంది, తమ ఫౌండేషన్ లో కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని, తమ కుటుంబ సభ్యులందరి సహకారంతో మాత్రమే ఈ ఫౌండేషన్ ఇతరులకు సహకారం అందిస్తుందని, పేద పిల్లల చదువుకు తమ ఫౌండేషన్ ఎంతో కృషి చేస్తుందన్నారు.
కేవలం యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాత్రమే క్రీడలను నిర్వహిస్తున్నామని, యువత పెడదారి పట్టకుండ మంచి అలవాట్లు అలవర్చుకోవాలని చెప్పారు. ఈ టోర్నమెంట్ నివహణలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు, తదుపరి గెలుపొందిన టీమ్ సభ్యులకు, ఇతరులకు బహుమతులు మరియు మెమొంటోలను ప్రదానం చేశారు.