రఘునాథపల్లి: తెలుగు గళం న్యూస్ /త్వరలో రానున్న ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, నల్గొండ మరియు ఖమ్మం జిల్లా లో ఎస్ జి టి ఉపాధ్యాయ లకు, మరియు ఎల్ ఎఫ్ ఎల్ ప్రధాన ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని తెలంగాణ ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాగ. కైలాసం ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో విలేఖరు ల సమావేశం లో వారు మాట్లాడుతూ గతం లో ఉపాధ్యాయ యు లు 7వ తరగతి, 10వ చదివి న వారు ప్రాథమిక పాఠశాల లో పని చేసే వారు అర్హులు కారని, హైస్కూల్ లో పని చేసే ఉపాధ్యాయులు డిగ్రీ, పీజీ పిహెచ్డి మరియు బిఎడ్, ఎంఈడి లు అర్హులు గా గుర్తించి ఆరోజు లో చట్టం తీసుకవచ్చారు, కానీ ప్రభుత్వండిగ్రీ, పీజీ, పీహెచ్డీ, బీఈడీ, ఎంఈడి లు ఎస్ జి టి లుగా పోటీ పడి ఉద్యోగాలు సంపాదించి టీచర్ లు గా వస్తున్నారని అలాంటి వారికి ఓటు హక్కు లేకపోవడంతో నిరాశగా ఉంటున్నారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి అందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఐక్యతగా ఉద్యమం చేయాలని వారు పిలుపునిచ్చారు.