ఎన్నికలకు సమాయత్తం కండి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన నాయిని
హన్మకొండ 49 వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షుడు నాగపురి దయాకర్ ఆధ్వర్యంలో డివిజన్ బూత్ కమిటీ మరియు డివిజన్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కండి. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన నాయిని…
ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకా విధానాలను ప్రజలకు చేరవేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలి.
డివిజన్ అద్యక్షులు డివిజన్లలో తిరుగుతూ డివిజన్లో పేరుక పోయిన సమస్యలను ప్రజలకు తెలియ చేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలి.
ఇలా చేయడం వల్ల అధికార పార్టీ నాయకులను ప్రజలు మరియు కార్యకర్తలు సమస్యలపై నిలదీసే అవకాశం ఉంటుంది.
తెలంగాణా వస్తే ప్రజల బతుకులు మారుతాయని, బాధలు పోతాయని నమ్మిన ప్రజలకు కే.సి.ఆర్.చెంది ఏమి లేదు.
తెలంగాణా సెంటిమెంట్ తో అధికరాం లోకి వచ్చి ప్రజలకు ఆయింట్ మెంట్ పూసిండు
పోరాడి సాధించుకున్న తెలంగాణాలో పేద ప్రజలకు ఒరిగింది ఏమి లేదు నిరుద్యోగుల చావులు, రైతుల ఆత్మ హత్యలు, సామాన్య ప్రజల నెత్తిపై అప్పులు తప్ప.
మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చ ప్రజల హామీలను విస్మరించిన కే.సి.ఆర్ ను గద్దె దించే సమయం ఆసన్నమయింది.
ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుంది.
సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున కార్యకర్తలందరూ ఇప్పడి నుండే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులూ కార్యకర్తలు ప్రతి ఒక్కరు తమ శక్తి మేరకు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
కష్ట పడే వారికి పార్టీ పరంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.
భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలను నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.
పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పడం జరిగింది.
తెలంగాణ రాష్టాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చిన ఈ తెలంగాణను కుటుంబం చేతిలో పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి తెలంగాణ ప్రజలను మోసం చేసాడని అన్నారు.
తొమ్మిది సంవత్సరాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు చేసింది ఏమి లేదు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిందేమంటే గత కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిన పథకాల పేర్లు మార్చుతూ, కట్టిన ప్రాజెక్ట్ లకు పేర్లు మార్చుతూ, రి డిజైన్ చేసి కాంట్రాక్టర్లకు జేబులు నింపడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మ్యానిఫెస్టో లో ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను తుంగలో తొక్కింది
పేద నిరుపేద ప్రజలకు ఎంతో మేలు చేకూర్చిన ఆరోగ్యశ్రీ పథకం కానీ పేద విద్యార్థులకు ఫీజు రి ఎంబెర్స్ మెంట్ ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
యువతకు ఉద్యోగాల పేరుతో మభ్య పెట్టింది.
కమీషన్లకు కక్కుర్తి పడి తెలంగాణాకే ప్రామాణికంగా ఉన్న చారిత్రక కట్టడాలను కూల్చివేసింది.
మాటల గారడితో ప్రజలను మభ్య పెడుతూ కాలయాపన చేస్తుందని కాబట్టి యువకులు మేధావులు విద్యార్థులు మేలుకొని మనం కన్న బంగారు తెలంగాణ కోసం పోరాటం చేయాలని అన్నారు.
మనం కలలు కన్నాతెలంగాణ బంగారు తెలంగాణ ను మల్లి మనం సాధించుకోవాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం అందరం కలిసి కట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ అజీజ్, జిల్లా ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ బొమ్మతో విక్రమ్, NSUI జిల్లా అధ్యక్షుడు పల్ల కొండ సతీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, అంబేడ్కర్ రాజు, టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి మొహమ్మద్ ముస్తాక్ nehal, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డి నేటర్ కేతిడి దీపక్ రెడ్డి, డివిజన్ ముఖ్య నాయకులు కె మల్ల రెడ్డి, నాగపురి కరణ్, అరుణ దేవి, ఈగ సతీష్, భూక్య గణేష్, సృజన్ బూత్ కమిటీ మెంబెర్స్ శ్యామ్, ch రాజేష్, కమలాకర్, స్వరూప్ రెడ్డి, భాను ప్రసాద్, హుస్సేన్ బీ, చిరేలా స్వామి, వర్ధన, నిజాముద్దీన్, వల్లెపు సాంబయ్య, కోటి, ఉపేందర్, మలోత్ రవి, గౌస్ పాషా, ఓం ప్రకాష్,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.