నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ వారి సతీమణి ఉమాతో కలిసి క్యాంపు కార్యాలయంలో వేద పండితులతో, ముస్లిం మాతాపెద్దలతో, క్రిస్టియన్ పాస్టర్లతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కుటుంబ సభ్యులతో గృహ ప్రవేశం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ మాట్లాడుతూ నా మానుకోట నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రతి కార్యకర్త, ప్రజలు నిత్యం ఈ క్యాంపు కార్యాలయంలో ఎప్పుడైనా సరే ప్రజలు వారి యొక్క సమస్యలను తెలుపవచ్చని నిత్యం వారి యొక్క సేవలో అభివృద్ధి బాటలో నడుస్తానని వారిని నడిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు జిల్లా నాయకులు సీనియర్ కార్యకర్తలు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు అనుబంధ సంఘాలు బంధుమిత్రులు ఆత్మీయులు వివిధ సంఘాల నాయకులు అధిక అనుబంధ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.