ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా విద్యార్థులకు డైనింగ్ టేబుల్స్ విడుదల
Uncategorized**ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర నాయకులు పెద్ద బోయిన వీరబాబు యాదవ్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదములుఈ69న్యూస్ మరిపెడ:-మహబూబాద్ జిల్లా మరిపెడ న్యూస్, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వీరబాబు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన సందర్భంలో విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులు సమస్య వలయంలో కొట్టుమిట్లాడుతున్నారు అని ఈ సర్వేలో తెలిసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని అలుపెరుగని పోరాటాలు చేస్తున్నది ఎస్ఎఫ్ఐ ఈ సర్వేలో విద్యార్థులు వారి సమస్యను చెప్పుకోవడం జరిగింది అన్నం తినే సందర్భంలో నేల మీద కూర్చుంటున్నాము మేము మాకు డైనింగ్ టేబుల్ ప్రభుత్వం కల్పిస్తే బాగుండేది అని విద్యార్థులు గోడు వెళ్ళబోయడం జరిగింది ఈ గోడు విన్న ఎస్ఎఫ్ఐ వీరబాబు సమరశీల పోరాటాలు అలుపెరగని పోరాటాలు కలెక్టర్ కార్యాలయం ముట్టడి రెండు నెలల పాటు చేయడం జరిగింది ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు భోజనం చేసే సందర్భంలో ఆరు బయట కూర్చుని నేల మీద కూర్చుని విద్యార్థులు భోజనం చేయవలసిన దుస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో ఉన్నదని ఆయన అన్నారు ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు డైనింగ్ టేబుల్ అందించిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఎస్ఎఫ్ఐ బృందం ఇలాగే మరెన్నో సమస్యలు వలయంలో విద్యార్థులు ఉన్నారు అన్ని సమస్యలను విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని వారు కోరడం జరిగింది ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలి విద్యార్థులకు అని వారు డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీనివాస్ సాదిక్ సందీప్ ప్రదీప్ రవి ప్రకాష్ సాయి మణిరత్నం మహేష్, కిరణ్ లాలు మోహన్ ఉదయ్ భాను భార్గవ్ గణేష్ తదితరులు పాల్గొనడం జరిగింది