జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ను స్టేషన్ ఘనపూర్ సిఐ జి. వేణు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మంచిగా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని తద్వారా మీ యొక్క తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు గౌరవాన్ని తీసుకు రాగలుగుతారని సూచించడం జరిగింది.మరియు చెడు అలవాట్లకు గంజాయి గుట్కా సిగరెట్ వంటి వాటికి అలవాటు పడకుండా మీ తోటి హాస్టల్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం లాంటిది చేయవద్దని మంచి పద్ధతిగా ఉంటూ కాలేజీ లో టీచర్లు చెప్పే పాటాలను శ్రద్ధగా చదువుతూ మంచి ర్యాంక్ సాధించాలని సూచించడం జరిగింది.మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు గాని మీరు మీ మొబైల్ కి వచ్చే అపరిచిత లింకులను ఓపెన్ చేయవద్దు ఒకవేళ ఓపెన్ చేస్తే మీరు మీ అకౌంట్ లో డబ్బులు పోగొట్టుకొని సైబర్ క్రైమ్ కు గురవడం జరుగుతుంది.కావున ఎవరైనా సైబర్ క్రైమ్ గురైనట్లయితే 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని మరియు ఏదైనా సమస్య వచ్చినప్పుడు 100 డయల్ కాల్*చేయవలసిందిగా సూచించడం జరిగింది.