ఏజెన్సీలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి బహుళ కంపెనీల వలే వెలుస్తున్న భారీ నిర్మాణాలను నిలిపివేసి చర్యలు తీసుకోవాలని స్థానిక తహసిల్దార్ కి ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షులు సొంది మల్లుదొర శుక్రవారం నాడు వినతి పత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడు పంచాయతీ లక్ష్మీ నగరం గ్రామ పరిధిలో 1/59 1/70 చట్టాలకు విరుద్ధంగా కంపెనీలను తలపిస్తున్న అక్రమ భవన నిర్మాణాలను ప్రారంభమయ్యాయి ఆ ప్రదేశాన్ని సందర్శించిన ఏవీఎస్పీ బృందం ఏజెన్సీ చట్టాలైన 1/70 చట్టానికి విరుద్ధంగా ఈ నిర్మాణం జరుగుతుందని మండల తహసిల్దార్ కు ఏజెన్సీ చట్టాలను కాపాడాలని, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని నిలుపుదల చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు సోందె మల్లు దొర మాట్లాడుతూ ఎటువంటి చట్టబద్ధత లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను ఏజెన్సీలో నిషేధించాలని లేదంటే ఏజెన్సీ ప్రాంతం కాస్త మైదాన ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఇటువంటి భారీ నిర్మాణాలు ఏజెన్సీ ప్రాంతాల్లో వెలుస్తున్న కూడా వాటిని కొందరు గిరిజనేతరులు చేపడుతున్న కూడా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మల్లు దొర ధ్వజమెత్తారు ఏజెన్సీ ప్రాంతాలలో చట్టాలను కాపాడవలసిన అధికారులే చూసి చూడనట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా అధికారులు మౌనవైఖరి వీడి చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. అట్టి నిర్మాణానికి సంబంధించి పంచాయతీ కార్యాలయం నుండి కూడా ఎటువంటి అనుమతులు లేవని కనుక రెవిన్యూ అధికారులు తక్షణమే అట్టి నిర్మాణాలపై ల్ టి ఆర్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక తహసిల్దార్ ని కోరారు, లేని ఎడల ఆ యొక్క అక్రమ నిర్మాణాల నిలుపుదలకు ఉన్నత అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఈ యొక్క కార్యక్రమంలో డివిజన్ నాయకులు కారం గోపాలరావు గోవిందరావు బాలకృష్ణ నరసింహారావు తదితరులు.