ఐ డి ఓ సి పనులను పర్యవేక్షించిన కలెక్టర్ శశాంక
Mahabubabadఈ69న్యూస్ మరిపెడ:-
ముఖ్యమంత్రి రాక పురస్కరించుకొని సమీకృత జిల్లా అధికారుల కాంప్లెక్స్ భవన సముదాయం పనులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక గురువారం సంబంధిత అధికారులతో సందర్శించి పరిశీలించారు. ముందుగా ప్లాంటేషన్ పనులను ఉద్యాన శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. మొక్కలను ప్రణాళిక బద్ధంగా నాటాలని సూచించారు. మొక్కలు చూపర్లకు అందంగా కనిపించాలన్నారు. ప్రతిరోజు మొక్కల పై నుండి వాటరింగ్ చేయాలన్నారు.ద్విచక్ర వాహనాలు కార్లు వంటి వాహనాల నిలుపుదలకు పార్కింగ్ స్థలం ఉండే విధంగా మొక్కలను నాటింప చేయాలన్నారు. భోజనాలు ఏర్పాట్లు చేసే స్థలాన్ని పరిశీలించారు. భోజనాలను కూడా పద్ధతి ప్రకారంగా ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారి కి తెలియజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాలు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు కిటికీలకు ఏర్పాటు చేసిన కర్టెన్స్ ను పరిశీలించారు.
కార్యాలయంలో గోడలకు జిల్లాలోని ప్రముఖ స్థలాలు, దేవాలయాలు, ప్రాజెక్టులు, అందమైన జలపాతాలు ఫోటోలు తీయించాలని జిల్లా పౌర సంబంధాల అధికారికి ఆదేశిస్తూ అట్టి చిత్రాలను ఫోటో ఫ్రేమ్ లుగా ఏర్పాటు చేసి కార్యాలయంలో గుర్తించిన 20 ప్రధాన స్థలాలలో ఏర్పాటు చేయించాలని జిల్లా సహకార శాఖ అధికారిని ఆదేశించారు. కార్యాలయ పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేయించి నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి సూచించారు.
కలెక్టర్ వెంట రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహణాధికారి తానేశ్వర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేందర్ ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, సహకార శాఖ అధికారి ఖుర్షీద్, పౌర సంబంధాల అధికారి శ్రీనివాస రావు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తహసిల్దార్ నాగ భవాని తదితరులు పాల్గొన్నారు.