కమ్యూనిస్టు యోధుడు,గొప్ప రాజనీతిజ్ఞుడు, ధీరోదాత్తుడు, సీతారాం ఏచూరి
Bhadradri Kothagudemకమ్యూనిస్టు యోధున్ని, గొప్ప రాజనీతిజ్ఞుణ్ణి ధీరోదాత్తుడు ని కోల్పోయామని, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటు అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏ.జె.రమేష్ లు అన్నారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి విద్యార్థి ఉద్యమం నుండి వామపక్ష భావాలపై మొగ్గుచూపి మార్క్సిస్టు ఉద్యమంలోకి వచ్చి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని అన్నారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై . 2005 నుంచి 2017 వరకు ఉత్తమ పార్లమెంటేరియన్ గా పార్లమెంటులో ఉన్నారని అన్నారు. సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా భారతదేశంలో మార్క్సిస్టు ఉద్యమాన్ని అనేక ఆటంకాలను అధిగమించి ముందుకు తీసుకుపోయారని అన్నారు. దేశ రాజకీయాలలో సెక్యులరిజం కాపాడేందుకు విశేషమైన కృషి చేశారని అన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో, కామన్ మినిమం ప్రోగ్రాం తయారుచేసి బడుగు బలహీన వర్గాల ఎజెండాను రాజకీయ ఎజెండాగా మార్చిన మహానేత కామ్రేడ్ సీతారాం ఏచూరి అని అన్నారు. తన మేధోశక్తితో దేశ రాజకీయాలలో ఒక చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అంతర్జాతీయ రాజకీయాలలో తనదైన శైలి ప్రదర్శించారని, క్యూబా అధ్యక్షుడు ఫెడరల్ కాస్ట్రోతో నిరంతరం చర్చలు చేసేవారని అన్నారు. ఆదర్శవంతమైన జీవనాన్ని సాగిస్తూ తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు సాగిన ధీరోదాత్తుడు కామ్రేడ్ ఏచూరి అని అన్నారు. కామ్రేడ్ ఏచూరి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బి .నర్సారెడ్డి వందన సమర్పణ చేశారు. ముందుగా కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటా పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.సంతాప సభలో డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్, టీజేఎస్ నాయకులు తిప్పన సిద్ధులు, సిపిఎం సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ ఎలమంచి రవికుమార్, సిపిఐ భద్రాచలం డివిజన్ నాయకులు రావులపల్లి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెళ్ల తిరుపతిరావు, టి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మెహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ప్రచార కార్యదర్శి కొడాలి శ్రీనివాస్, టిఆర్ఎస్ పట్టణ నాయకులు ఏ .సునీల్ కుమార్,లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రామలింగేశ్వర రావు, ఐలు జిల్లా అధ్యక్షులు ఎం వి ప్రసాద్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త పల్లంటి దేశప్ప, కొండ రెడ్డి సంఘం జాతీయ నాయకులు ముర్ల రమేష్,లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ చైర్మన్ సాయి సూర్య తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో భద్రాద్రి ఆదివాసి సమితి నాయకులు పూనం వీరభద్రం, రవి వర్మ, కృష్ణ, సిటీ కేబుల్ అధినేత కోడూరు సత్యనారాయణ, యుటిఎఫ్ నాయకులు ఏ వెంకటేశ్వర్లు, విజయ్ మాల మహానాడు నాయకులు దాసరి శేఖర్, అల్లాడి పౌల్ రాజ్, మైనారిటీ నాయకులు మునాఫ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు రమేష్, బాలాజీ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగా, వై వెంకట రామారావు పి సంతోష్ కుమార్, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి సీతాలక్ష్మి జీవనజ్యోతి నాగరాజు శ్రీను లక్ష్మణ్ భూపేంద్ర తదితరులు పాల్గొన్నారు