కళ్యాణానికి ముస్తాబైన రాముల వారి దేవస్థానం
Mahabubabadశ్రీ లక్ష్మీ నరసింహ సమేత సీతారామ చంద్ర స్వామి వారి దేవాలయం యొక్క విశిష్టత మహబూబాబాద్ జిల్లా. మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో దాదాపు 130 సం॥రాల క్రితం ఈ గ్రామ దొరవారైన నూకల వెంకటనరసింహరెడ్డి గారు ప్రతి సంవత్సరం భద్రాచలం స్వామి వారి కళ్యాణానికి వెళ్తూ స్వామివారిని ఆరాధిస్తూ ఉండగా ఒకరోజు ఆ భద్రగిరీశుడైన శ్రీరామచంద్ర ప్రభువు దొరవారికి స్వప్నంలో సాక్షాత్కరించి నీ భక్తికి మెచ్చాను భక్తా ఈ క్షేత్రంలో మాదిరిగానే స్వామివారి తొడమీద అమ్మవారు కుర్చోనే ఉండటం గ్రామానికి పడమర దిక్కున గల గుట్టలో నా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను తెచ్చి నా గుడి కట్టించమని స్వామి వారు వారితో చెప్పి అదృశ్యమవ్వగా వెంటనే స్వప్నంలో నుండి మేల్కొన్న ఆ దొరవారు భక్తి శ్రద్దలతో వెళ్ళి స్వామివారు చెప్పిన ప్రదేశములో వెతుకగా అద్భుతముగా అక్కడ శ్రీ సీతారామచంద్ర అక్ష్మణ స్వామి మూలవిరాట్ విగ్రహాలు లభించగా అత్యంత ఆనందముతో అన్ని హంగులతో స్వామివారి ఆదేశానుసారము గుండెపుడి గ్రామంలో ఈ ఆలయ నిర్మాణం చేయటం జరిగినది. ఆ కాలంలో అనోటా, ఈ నోటా స్వామివారి మహత్తుని వినిన నిజాంనవాబు కూడా స్వామి వారిని దర్శించుకుని ఆలయానికి కొంత భూమిని ఇవ్వడం కూడా జరిగింది. స్వామివారి మహత్తును విని ఎందరో వివాహం కానివారు, సంతానం లేనివారు, ఉద్యోగాలు రానివారు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహంతో వారి కోరికలు తీరటం ఇక్కడ సాధారణమైన విషయం. మారుమూల ఉన్న ఈ ఆలయ విశిష్టతను అందరికి తెలియచేసి అందరినీ తరింపచేయాలనేదే దేవాలయం విశిష్టత.
ఆలయ విశిష్టత దేశంలోనే ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయనంలో ఒకసారి సూర్యకిరణాలు స్వామివారి మీద పడటం ఈ క్షేత్రంలో తప్ప ఎక్కడా
చూడలేము. దసరా సమయంలో 11 రోజులు, రధసప్తమి సమయంలో 11 రోజులు స్వామివారి మీద సూర్యకిరణాలు పడటం జరుగుతుంది. భగవత్ బంధువులారా స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సం “ర చైత్ర శుద్ధ నవమి 30-03-2023 గురువారం మధ్యాహ్నం గం 11-55 ని” లకు పునర్వసు నక్షత్ర సుముహూర్తమున శ్రీ అయోధ్య గుండెపుడి నగరాధీశులు దశరథ మహారాజు గారి జ్యేష్ఠ కుమారుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సూర్యవంశ ప్రదీపుడు శ్రీమత్ ఇక్ష్వాకు వంశోద్భవుడు సాక్షాత్ శ్రీనారాయణ స్వరూపుడు “శ్రీరామచంద్ర స్వామి” వారికి శ్రీ మిధిలా బురహాన పురం నగరాధీశులు వీరధ్వజ జనక మహారాజు గారి కుమార్తె శ్రీ చతుర్ధశ భువనాధీశ్వరి అఖిలాండకోటి బ్రహ్మాండనాయికి, తత్వస్వరూపిణి, చంద్రవంశ ప్రదీపిక, నిమవంశోద్భవి, శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి “శ్రీ సీతాదేవి” ని ఇచ్చి గుండెపుడి లోని శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపంలో వివాహము జరిపించుటకు భగవత్ నిర్ణయమైనది. కావున యావన్మంది భగవత్ బంధువులంతా విచ్చేసి స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి తరించవలసినదిగా గ్రామ ప్రజల సహకారంతో రాముల వారి యొక్క కళ్యాణం చూద్దాం రండి. స్వామి వారి యొక్క కార్యక్రమం వివరాలు ఈరోజు నుండి ప్రారంభం ఈరోజు అంకురార్పణ, పుణ్య హవానం, రక్షాబంధనం, బుధవారం రోజున అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, అదే రాత్రి :గరుడ ముద్ద, గురువారం రోజున స్వామి వారి కళ్యాణం, ఆ రాత్రి ఎదురుకోల్ల సేవ అలక అంటారు శుక్రవారం రోజున రాత్రి ఏడు గంటలకు పోన్న సేవ శనివారం రాత్రి ఏడు గంటలకు రధ సేవ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల వసంతోత్సవం అంటే దోపు సేవ అదే రాత్రి పూర్ణాహుతి, సప్తవర్ణ సేవలు, ధ్వజ అవరోహణం, సోమవారం రోజున ద్వాధశారాధన మళ్లీ అదే రోజున ఏకాంత సేవ అంటే పవళింపు సేవ ఈ కార్యక్రమాలు గ్రామ ప్రజల సహకారంతో ఆలయ ధర్మకర్తలు నూకల సుధీర్ రెడ్డి, నూకల కిషన్ రెడ్డి గ్రామ సర్పంచ్, అదేవిధంగా నూకల కిరణ్ రెడ్డి సహకారంతో అదే విధంగా ముఖ్య ఆలయ నిర్వహణాధికారి ప్రధానార్చకులు సముద్రాల వెంకట లక్ష్మీ నరసింహ చార్యులు, సహాయ అర్చకులు, రాఘవాచార్యులు అదేవిధంగా రాజ వంశీ ,సహకారంతో స్వామి వారి కళ్యాణానికి దేవస్థానం ముస్తాబయింది.