కుక్కలు,కోతుల బెడదను అరికట్టడంలో జి డబ్ల్యు ఎం సి విఫలం: డివైఎఫ్ఐ
Hanamkondaనగరంలో కుక్కలు, విలీన గ్రామాల్లో కోతుల బెడదను అరికట్టడంలో జి డబ్ల్యు ఎంసీ పూర్తిగా విఫలమైందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గేల తిరుపతి విమర్శించారు.
హనుమకొండ,రాంనగర్ సుందరయ్య భవన్ లో డివైఎఫ్ఐ సమావేశంలో మాట్లాడారు. కుక్కలు, కోతులు మనుషులపై దాడులు చేస్తున్న పట్టించుకోవడంలేదని, వాటి నియంత్రణ కోసం ప్రతి ఏటా లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తున్నప్పటికీ నియంత్రించడం మాత్రం శూన్యంగా మిగిలిందన్నారు. కాగితాల పైనే నియంత్రణ ఉంటుందని నిధులు మాత్రం నీళ్లలో ఖర్చవుతుంది అన్నారు. నగరంలోని కుమార్ పల్లి, గుండ్ల సింగారం, పెద్దమ్మ గడ్డ, జులైవాడ లాంటి ప్రాంతాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ రాత్రి వేళల్లో ఒంటరిగా వస్తున్న మనుషులపై దాడులు చేస్తున్నాయని, ఉదయం వేళల్లో పనులకు, స్కూళ్లకు వెళ్లే వాళ్ల ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నారని, ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్న వాటిని మాత్రం ఎందుకు నియంత్రించడం లేదన్నారు. వీధి కుక్కలకు సర్టిలైజేషన్ చేయాలని సిడిఎంఏ చెబుతున్న పట్టించుకోవడం లేదన్నారు, విలీన గ్రామాల్లో కోతుల బెడదతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాదు తరహ సంఘటన హనుమకొండలో జరగకుండా ఉండేందుకు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, కుక్కలు కోతల నుంచి రక్షణ కల్పించాలని, వాటి బెడదను అరికట్టాలని తిరుపతి డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు జడల కృష్ణమూర్తి, జి. బిక్షపతి, పి.మహేందర్, ఎం. శ్రీనివాసు, ఏం సతీషు, చిరంజీవి,రాజు, శ్రీకాంత్, అనీల్, కుమార్ లు పాల్గొన్నారు