ఈ69 న్యూస్ జఫర్ఘడ్ మార్చి 22 జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూర్ గ్రామంలోని పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి చనిపోయినట్లు పోలిసులు మీడియాకు తెలిపారు.ఎస్సై మాధవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..కూనూర్ గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ అలి(48) బుధవారం చెరువులో శవమై తేలడాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమచారం ఇచ్చారని,వెంటనే మేము సంఘటన స్థలానికి చేరుకుని గ్రామ పంచాయతీ సిబ్బందితో శవాన్ని బయటకు తీయించామని తెలిపారు.కాగా మృతుడికి ఇంకా పెళ్లి కాలేదూ,కూలీ పని చేసుకుంటూ ఒక్కడే జీవనం సాగిస్తున్నాడు.కొంత కాలంగా మనస్తాపంగా ఉంటున్నట్లుగా మిత్రులు తెలిపారని,దాని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్లు తెలిపారన్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ మాధవ్ గౌడ్ తెలిపారు.