కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి -సిపిఎం
Warangalకేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంట. కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఈరోజు కాజీపేట తహసిల్ ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పార్టీ మండల కార్యదర్శి తొట్టె మల్లేశం గారు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకముందు కేవలం 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర. నేడు 1200 రూపాయలు అయింది. ఈరోజు కమర్షియల్ గ్యాస్ పైన కూడా 350 రూపాయలు అదనంగా పెంచారు. పెరిగినటువంటి నిత్యవసర సరుకుల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మళ్లీ గ్యాస్ ధర పెరగడం వలన కనీసం తినడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. మూడు పూటలా తినడానికి రెక్కల కష్టం పై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ఆర్థికంగా మరింత అగాధంలోకి నెట్టివేయబడతారు. చిన్న చిన్న హోటల్లు. తోపుడుబండ్లపై టిఫిన్ సెంటర్లు. మొబైల్ టిఫిన్ సెంటర్ నడిపే చిరు వ్యాపారులు. కమర్షియల్ గ్యాస్ పై 350 రూపాయలు ఒకేసారి పెంచడం వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని. తన సహజ మిత్రుడైన ఆదానిగారి అప్పులను తీర్చడానికి ప్రధానమంత్రి మోడీ మిత్ర ధర్మం పాటించి ప్రజలపై భారాలు మోపారని. మోడీ అధికారంలోకి రాకముందు మూడు వేల కోట్లు ఉన్న ఆదాని ఆదాయం నేడు 17 లక్షల కోట్లకు పెరిగిందని. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వం పేద ప్రజలపై భారాలు వేసి కనీసం తినడానికి తిండి లేకుండా చేస్తుందని ఇది ప్రజల యొక్క ఉసురు తీయడమేనని. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని. లేనిచో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడ్డం అశోక్. జంపాల రమేష్. గద్దల బద్రి. యజ్ఞం స్రవంతి. నముకు. వెంకన్న. భరత్. రవీందర్. మాతంగి బాబు తదితరులు పాల్గొన్నారు.