కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలి.
Uncategorizedమునగాలకేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు మేదరమెట్ల వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం పార్టీ మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలకు నిరసన మండల కేంద్రంలో ఫ్లై ఓవర్ దగ్గర ధర్నా నిర్వహించే రాస్తారోక చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు మేదరమెట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్రం లో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజల పైన అనేక భారాలు పడుతున్నాయని బిజెపి ప్రభుత్వం అధికారంలో రాకముందు 400 ఉన్న గ్యాస్ ధర నేడు అధికారంలో కొచ్చిన తరువాత1200 రూపాయలకు పెంచి పేద మధ్యతరగతి ప్రజల అందకుండా చేస్తున్నారని సామాన్య ప్రజల పైన భారాలు మోపుతున్నారని గ్యాస్ ధర పెరగటం వల్లన కట్టెల పొయ్యి పైన వంట వండుకునే పరిస్థితి బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చింది అన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, షేక్ సైదా, దేశ్ రెడ్డి స్టాలిన్ రెడ్డి, మండవ వెంకటాద్రి, బట్టు నాగయ్య, అనంత గురువయ్య, కృష్ణారెడ్డి మంగయ్య మల్లారెడ్డి, శేఖర్ రెడ్డి, నందిగామ సైదులు, వెంకన్న, మల్లయ్య,గడ్డం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు