కొన్ని ప్రాంతాల్లో మొదటి విడత ఇవ్వలేని బీసీ బంధు౼నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్

●లబ్ధిదారులందరికి వచ్చునా !?
★అసెంబ్లీ సీట్లు కేటాయించిన పార్టీలకే మద్దతు ఇద్దాం


         మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో నేషనల్ ధోభీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు బాగున్నప్పటికి అమలులో జాప్యం జరుగడమే కాకుండా అమలైన పథకాలైన బీసి బంధు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, డబుల్ బెడ్రూం ఇండ్లు .నిజమైన రజక వృత్తిదారులకు ఇవ్వాలని కోరారు.లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి ఎలక్షన్ కోడ్ రాకముందే ఇచ్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు కొన్ని చోట్ల బీసీ బంధు మొదటి విడత ఇవ్వగా కొన్ని చోట్ల ఇవ్వకపోవడం సరైనది కాదని అన్నారు.అదేవిధంగా డబుల్ బెడ్రూంలు ఇండ్లు లేని  నిరుపేద రజక కుటుంబాలకు ఇవ్వాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు రజకులకు అసెంబ్లీ సీట్లు కేటాయించి రజకుల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్ధులను బరిలో దింపి మా ఓటు మేమే వేసుకొంటామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *