కొమరం భీమ్ విగ్రహానికి శంకుస్థాపన
Bhadradri Kothagudemదుమ్మగూడెం మండలంలో ఈరోజు ఆదివాసి సమరయోధుడు కొమరం భీమ్ విగ్రహా నిర్మాణానికి తొలి అడుగు పడింది. మండల కేంద్రంలోని ములకపాడు సెంటర్లో ఆదివాసి నాయకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులతోపాటు పలు గ్రామాల నుంచి విచ్చేసిన ఆదివాసి పెద్దలు యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదివాసి సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి కొమరం దామోదరం మాట్లాడుతూ కొమరం భీమ్ విగ్రహ ప్రతిష్టాపనతో ఆదివాసుల మధ్య ఐక్యత పోరాట పటిమ పెరుగుతుందని కొమరం భీమ్ పోరాట చరిత్ర భావితరాలకు ఈ విగ్రహ ప్రతిష్టాపనతో ఆదర్శంగా ఉంటుందని పేర్కొన్నారు.ఇదే కార్యక్రమంలో ఆదివాసి యువజన నాయకులు తెల్లం హరికృష్ణ మాట్లాడుతూ అనతి కాలం నుండి ఆదివాసుల చట్టాలను హక్కులను కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అయితే ఆదివాసి చట్టాలను హక్కులను అంచలంచలుగా హరిస్తూ ఆదివాసుల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు, ఫిఫ్త్ షెడ్యూల్ లోని పిసా,1/ 70 యాక్ట్ లను ఆదివాసి ప్రాంతాలకు పూర్తిస్థాయిలో విస్తరింప చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తెల్లం సీతమ్మ, మాజీ ఎంపీటీసీ రేసు లక్ష్మి , సరియం కోటేశ్వరరావు, కామరాజు లు పాల్గొన్నారు