నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు కోట చెరువులో ఎవరు గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని.ఇక్కడ నిమజ్జనం చేయాలనుకున్న గణేష్ విగ్రహాలను దేశాయిపేట లోని చిన్న వడ్డేపల్లి చెరువులో చేయాలని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ అన్నారు.ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీలు,భక్తులు ఎవరుకూడా గణేష్ ప్రతిమలను కొత్తచెరువులో నిమజ్జనం చేసేందుకు రావద్దని,చిన్న వడ్డెపల్లి చెరువులో నిమజ్జనం చేసేందుకు పూర్తి స్థాయిలో బారికేడ్లు పూర్తిస్థాయి లైటింగ్స్ రోడ్డుకు మరమ్మత్తులు జి డబ్ల్యు ఎం సి సహకారంతో మరియు ఏడి మైనింగ్ క్రేన్ల అదనంగా క్రేన్లను ఏర్పాటు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ మార్పును భక్తులు స్వాగతిస్తూ పోలీసులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు.