గంగదేవిపాడు బి.టి రోడ్డు నిర్మాణానికి రూ,, 9 కోట్లు నిధులు మంజూరు పట్ల రైతులు హర్షం
Khammam**తల్లాడ వయామల్లారం – * **సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మేల్యే సండ్ర చిత్ర పటాలకు పాలాభిషేకం, పూలాభిషేకం చేసిన : గ్రామాల ప్రజలు, రైతులు** **మళ్ళీ రాబొయేది తెలంగాణ ప్రభుత్వం , మళ్ళీ గెలిచేది ఎమ్మేల్యే సండ్ర నే అని ప్రజల ధీమా****ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం చేసిన : ఎమ్మేల్యే సండ్ర** …………………..తల్లాడ : తల్లాడ నుంచి మల్లారం మీదుగా *గంగదేవిపాడు వెళ్ళు రోడ్డు వరకు 6.5 కిలో మీటర్లు నిర్మాణానికి 9 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ గారికి, ఆర్. అండ్. బి మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, విశేష కృషి చేసిన ఎమ్మేల్యే సండ్ర వెంకటవీరయ్య గారికి, మల్లారం గ్రామ రైతులు, ప్రజలు, అందరూ సమిష్టిగా వారి వారి చిత్ర పటాలకు పాలాభిషేకం, పూలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు*ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు, ప్రజలు మాట్లాడుతూ…. *ఎన్నో ఏళ్లుగా ఆ రహదారి నిర్మాణం కోసం ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి దృష్టికి తీసుకెళ్లగా తప్పక బిటి రోడ్డు నిర్మాణం చేపిస్తానని వారు ఇచ్చిన హామీ ప్రకారం, ఆర్ అండ్ బి శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సంబంధిత ఉన్నత అధికారులకు అనేక పర్యాయాలు విన్నవించి నిధులు మంజూరు చేపించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం నిరంతరం పని చేసే ఎమ్మేల్యే ఉండటం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని అన్నారు. ఈ రోజుల్లో మాట ఇవ్వడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారం రూ,, 9 కోట్ల రూ,,లు మంజూరు చేయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం లో ఎమ్మేల్యే సండ్ర గారిదేనన్నారు. ప్రజల్లో ఒకరిగా వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటూ నిరంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సండ్ర వెంకట వీరయ్య గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా అండగా నిలుస్తారని, మంచి నాయకుణ్ణి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మళ్ళీ రాబోయేది సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వమేనని, మళ్ళీ ఇక్కడ గెలిచేది మన హ్యాట్రిక్ హీరో ఎమ్మేల్యే సండ్ర గారెనని ధీమా వ్యక్తం చేశారు*ఈ కార్యక్రమంలో….*రైతు బంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర. వెంకటలాల్,రైతు బంధు గ్రామ అధ్యక్షులు దడిపల్లి. సితారములు, సోసైటీ డైరెక్టర్ కటికి. నరసింహారావు, టి. ఆర్. యస్ నాయకులు కటికి. రాఘవ రావు, వెంకటేశ్వర రావు (కె. వి ),కటికి వెంకట రామారావు,తూటరి. వెంకటి, బెల్లంకొండ. వెంకట్రావమ్మ, దుగ్గిదేవర. కుమారి, కటికి. నాగమణి, దుగ్గిదేవర. చందర్ రావు, దుగ్గిదేవర రామారావు, రేగళ్ల. లక్ష్మణ్ రావు, దాసరి. శ్రీనివాస రావు, దాసరి. క్రిష్ణయ్య, దాసరి. ప్రసాద్, మూలగుండ్ల. నాగేశ్వరావు, చాపల. ఉపేంద్ర,దుగ్గిదేవర. సైదులు, దుగ్గిదేవర. గోపాల రావు,తదితరులు పాల్గొన్నారు*