గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ ఖమ్మం గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న గౌరవ సర్పంచ్ శ్రీ తెళ్లూరి కృష్ణయ్య గారు,కార్యదర్శి శ్రీ పి నరేంద్ర గారు,గ్రామ అభవృద్ది కమిటీ చైర్మన్ శ్రీ మువ్వా మురళీధర్ రావు గారు ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడం ఎంతో సంతోషం అని, మా గ్రామ పంచాయితీ నందు మొత్తం అన్ని రోడ్లు కూడా గౌరవ సత్తుపల్లి శాసన సభ్యులు శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారి సహాయ సహకారాలతో సి సి రోడ్డు వేయడం జరిగిందని ,ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు అనగా నర్సరీ,పల్లె ప్రకృతి వనం,క్రీడా ప్రాంగణం,వైకుంఠ ధామం,సెగ్రిగేశన్ షెడ్ అన్ని కూడా సక్రమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ క్రమంలో అవార్డ్ పొందిన గ్రామ పంచాయితీ వారిని గౌరవ మండల పరిషత్ అధికారి శ్రీ భిమిరేడ్డి రవీంద్రా రెడ్డి గారు మరియు మండల పంచాయితీ అధికారి శ్రీమతి కొండపల్లి శ్రీదేవి గారు, డివిజనల్ పంచాయితీ అధికారి శ్రీ వాసిరెడ్డి ప్రభాకర్ రావు గారు అభినందించారు