దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజన జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ ప్రభుత్వం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనంతగిరి మండలానికి చెందిన గిరిజనులకు గిరిజన కార్పొరేషన్ ద్వారా మంజూరైన 47.65 లక్షల రూపాయల విలువగల చెక్కులను 40 మంది లబ్దారులకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా. ఆయన మాట్లాడుతూ…….. లబ్ధిదారులందరూ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికచేయుతను సద్వినియోగం చేసుకొని వ్యాపారంలో రాణించాలని ఆయన అన్నారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున లోన్ లు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని గిరిజనుల ఆర్థికంగా బలపడాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు.గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన అన్నారు.నేడు గిరిజనులు విద్యాధికులై ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు అని ఆయన తెలిపారు.గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు పాటుపడుతున్నదని అన్నారు.తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి గిరిజనులకు రాజ్యాధికారంలో కీలక భాగస్వామ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఆయన తెలిపారు.గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గిరిజనులు అన్ని రంగాలలో ఎదగాలని అన్నారు .గిరిజనులంతా ఐకమత్యంతో మెలిగి పార్టీలకు అతీతంగా కృషి, పట్టుదలతో పరస్పర సమన్వయంతో పనిచేసి కోదాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. పేద ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలందరి నుండి ఆశీర్వాదం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ, మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి యాకోబ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు శ్రీనివాస్ నాయక్,బొజ్జగూడెం తండా సర్పంచ్ వెంకటేశ్వర్లు, పాలారం తండా సర్పంచ్ శీను బాబు, నాయకులు భానోత్ ప్రసాద్, శంకర్, రవి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.