మునగాల మండలం ఈదులవాగు తండా లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న సరే నెం 61 రామలింగం బండ సమస్యను వెంటనే పరిష్కరించాలని మునగాల తహసీల్దార్ కు గ్రామస్తులు మెమోరాండం అందించారు.గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొని మాకు న్యాయం చేయాలని నినాదాలు చేసుకుంటూ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. గత 50 సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటూ బండను నమ్ముకొని బ్రతుకుతున్నట్లు వివరించారు. అధికారులు బండ లీజు దారులతో కుమ్మకై మా ఉపాదిమీద, మా ఇల్లులు కూల్చే ప్రయత్నం చేసున్నారని వాపోయారు. లీజు దారులు బండపై పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు చేస్తున్నారని, బండమీద యంత్రాలను ఉపయోగించడం వల్ల దాని నుంచి వచ్చే విషపు నీరు వల్ల పశువుల కు ప్రాణ హాని ఉందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడా ప్రసాద్, ఉప సర్పంచ్ పిచ్చయ్య, శివాజీ, జను, రవి తదితరులు పాల్గొన్నారు.