జనగామ జిల్లా జఫర్గడ్ మండలం లోని కోనాయిచలం గ్రామానికి చెందిన చంద రమణ,అనిల్ లు ఇద్దరూ కలిసి బుధవారం రోజున మండలంలోని ఓబులాపురం గ్రామంలో తమ మిత్రుడి పెళ్లికి వెళ్లి తిరిగి రాత్రి 1.30ని.లకు వారి స్వగ్రామానికి గ్లామర్ బైక్ మీద వెళ్తుండగా ఓబులాపుర్ క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి ఎదురుగా ఉన్న గోడకు ఢీ కొని రమణ అక్కడిక్కడే మృతి చెందాడు.అనిల్ గాయాలతో స్పృహ కోల్పోయాడు.అటుగా వెళ్ళుతున్న కోళ్ళ సరఫరా వాహనంలో ఉన్న వాళ్లు చూసి అంబులెన్స్ కి మరియు పోలిస్ లకు సమాచారం ఇచ్చారు.స్థానిక పోలీసులు,108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రమణ మృతి చెందాడని నిర్థారించి గాయపడిన అనిల్ ను 108 వాహనంలో హాస్పిటల్ కు తరలించారు.గ్లామర్ బైక్ చనిపోయిన రమణదని నడిపింది మాత్రం అనిల్ అని రమణ తల్లి ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై బి. మాధవ్ గౌడ్ తెలిపారు.