ఘనంగా సీపీఐ పార్టీ 98 వఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Jangaon***ఊరూరా ఎర్రజెండాలు ఆవిష్కరణ* జఫర్గడ్ డిసెంబర్ 26జఫర్ఘడ్ మండలంలోని అన్ని గ్రామాలలో భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎర్రజెండాలు ఎగరవేవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పుగళ్లు గ్రామంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పెండ్యాల సమ్మయ్య జెండా ఎగురవేశారు.పార్టీ జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి మరియు మండల కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు జువారి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.98 సంవత్సరాలుగా ఆనాడు స్వాతంత్ర్య కోసం మరియు భూమికోసం భుక్తికోసం వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి10లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సీపీఐ దేనని అన్నారు.ప్రస్తుత మతోన్మాద ప్రభుత్వాలు ప్రజల పై అనేక భారాలను మోపి ప్రజల జీవితాలతో చెలగాటం అడుతున్నాయని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని దున్నేవాడిదే భూమి గిచ్చే వాడిదే చెట్టు అనే నినాదాన్ని తీసుకొచ్చిన ఘనత ఎర్రజెండా పార్టీ సీపీఐ కే దక్కుతుందని అన్నారు.రానున్న రోజుల్లో ఆందోళన మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయకార్యదర్శి కావాటి యాదగిరి నాయకులు తోట రమేష్ మండల సహాయ కార్యదర్శి రడపాక సత్తయ్య మధు బుచ్చయ్య ముసలయ్య వెంకటయ్య యాకయ్య తదితరులు మహిళలు పాల్గొన్నారు.