నాఫెడ్ వారిచే తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ వారి ఆధ్వర్యంలో పిఏసీఎస్ తాంసి ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ తాంసి యందు శనగల కొనుగోలు కేంద్రమును ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు ప్రారంభించారు. అనంతరం రైతు విట్ఠల్ ను శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి, రైతుని రాజుని చేయాలని తపన ఉంది కాబట్టి దేశంలో రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది గ్రహించి రైతుల కోసం రైతు బంధు అందించి, రైతు చనిపోతే రైతు చనిపోతే రైతు కుటుంబం కష్టాల బారిన పడొద్దని రైతు భీమా అందిస్తూ రైతు ఆదుకుంటుందని ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపియ్యట్లేదని దయచేసి బిఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలకు కంటి వెలుగులో పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలు అందించాలని గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంర విజయలక్ష్మి - రాజు, పిఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, ఎంపిపి శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపిపి రఘు, సర్పంచ్ కృష్ణ, రైతు బంధు కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి గార్లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు రైతు నాయకులు పాల్గొన్నారు.