రఘునాథపల్లి: తెలుగు గళం న్యూస్/తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి స్ఫూర్తిగా నిలిచిన చిట్యాల (చాకలి) ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్ గౌడ్ అన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మండలంలోని ఖిలాషాపురం గ్రామంలో మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అగ్నికన్నం ఐలమ్మని, భూమికోసం భుక్తి కోసం దోపిడి పీడన విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయిధ రైతన్న పోరాటంలో దొరలను గడగడ లాలించిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు.ఈ కార్యక్రమంలో రజకసంఘం నాయకులు మేడిపల్లి వెంకన్న, బండారి సంపత్, ఆలేటి మహేందర్, మేడిపల్లి చంద్రమోహన్, రాపాక నాగరాజు, ఆలేటి రాములు,యామంకి ఆంజనేయులు, బాల్నే రాజయ్య, శాగ ధనుంజయ్,శాగ బాస్కర్,మస్సి ఎల్లేష్, బూరుగు వెంకటస్వామి, శివరాత్రి ఉప్పలయ్య, శివరాత్రి వెంకట మల్లయ్య, శివరాత్రి యాదగిరి, శాగ యాదగిరి,బండమీద నాగేష్, కావేరి రామ్మోహన్, మీసాల రాజు తదితరులు పాల్గొన్నారు.