చారిత్రక ప్రసిద్ధ ఆలయాల పర్యాటక క్షేత్రంగా పాలకుర్తి
Jangaonకాకతీయుల కళా విశిష్టతకు పూర్వ వైభవం
తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
(పాలకుర్తి, జనవరి 07)
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దయాకర్ రావు గారి నియోజకవర్గం కేంద్రం స్వయంగా స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. మొట్టమొదటి గద్య రచయిత, నిజమైన ఆదికవి పాల్కూరి సోమనాథుని స్వస్థలం కావడంతో పాటు కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక ప్రసిద్ధ ఆలయాలకు పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంగా విలసిల్లుతోంది.
భాగవతాన్ని రాసిన పోతన పుట్టిన స్థలం బమ్మెర.
రామాయణాన్ని రాసిన వాల్మీకి రచనలు చేసిన ప్రాంతం వల్మిడి.
క్రీస్తు శకం 9,10వ శతాబ్దాలలో కళ్యాణ, చాళుక్యులు నిర్మించిన అతి విశిష్టమైన త్రికూఠాలయంగా చెన్నూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానం.
మహిమాన్విత లక్ష్మీనరసింహస్వామి కొలువుగా విలసిల్లుతున్న వాన కొండయ్య ఆలయం.
వెలమ, రెడ్డిలు కలిసి గొప్పగా నిర్మించిన పురాతన సన్నూరు వేంకటేశ్వర స్వామి ఆలయం
పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ వారసత్వ సంపదకు చిహ్నాలు.
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై, శిథిలావస్థకు చేరుకుని, ఉనికి కనుమరుగవుతున్న క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ తెలంగాణ వారసత్వ సంపదను, కాకతీయుల కళా విశిష్టతను కాపాడేందుకు నడుము కట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాదాపు 50 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు విడుదల చేయించి వాటి పరిరక్షణ పనులు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేడు ఈ ఐదు చారిత్రక ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధి పనులను జిల్లా అధికారులు, నిపుణులతో పర్యవేక్షించేందుకు వాటిని నేడు సందర్శిస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గం లోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించి అక్కడి పనులను పర్యవేక్షించారు.
మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు…
శివరాత్రికి పాలకుర్తి కళ్యాణ మండపం ప్రారంభం చేసుకుంటున్నాం.
800 ఏళ్ల కింద ఇక్కడ పుట్టిన ఆది కవి పాల్కురికి సోమనాథుడు.
సామాన్యులకు అర్థమయ్యే విధంగా రచనలు చేశారు.
ఆయన విగ్రహం ఇక్కడ ప్రతిష్టిస్తున్నాం.
ఇక్కడ టూరిజం హరిత హోటల్ ఇక్కడ పెడుతున్నాం.
హోటల్ కోసం స్థలం ఇచ్చిన ఇక్కడ ఉన్న స్థానికులకు వేరే చోట ఇండ్లు ఇచ్చి, టూరిజంలో ఉద్యోగాలు ఇస్తున్నాము.
ఇక్కడ హరిత హోటల్ 25 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని టూరిజం ఎండీ మనోహర్ రావు తెలిపారు.
పాలకుర్తి బాగా అభివృద్ది జరిగింది. సంతోషం అనిపించింది.
శివరాత్రి నాటికి మరిన్ని పనులు చేసి పోతన క్షేత్రాన్ని ప్రారంభం చేసి, హోటల్ కు శంకు స్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్ గారిని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆహ్వానిస్తాము.
ఎక్కువగా ఇక్కడ హరిత వనాన్ని పెంచాలి.
భాగవతం రాసిన పోతన పుట్టింది బమ్మెర. గతంలో బమ్మెరను, పోతనని ఎవరూ పట్టించుకోలేదు. ప్రొఫెసర్ పాపారావు గారు ఎంత అడిగినా పట్టించుకోలేదు.
సీఎం కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రిగారు స్వయంగా వచ్చి 15 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
ఇప్పుడు 22 అడుగుల పోతన విగ్రహం తయారు చేస్తున్నాము.
పోతన ఒక రైతు. భాగవతం రాసిన గొప్ప వ్యక్తి. మన దగ్గర పుట్టడం మనం హర్షించదగింది.
వల్మిడి గుట్ట మీద కూర్చొని వాల్మీకి రామాయణం రాశారు. సాక్ష్యాలు ఉన్నాయి.
నేను చిన్నప్పుడు వల్మిడికి వచ్చి రాముడికి కళ్యాణం చేయించే వాళ్ళం.
గత కొంత కాలంగా నిర్లక్ష్యం కాగా మళ్ళీ ఇప్పుడు 15 కోట్లతో పునరుద్ధరిస్తున్నాం. అక్కడ భారీ వాల్మీకి విగ్రహం పెడుతున్నాం.
సీఎం కేసీఆర్ గారు అడగగానే వీటి అన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు.
తెలంగాణ వారసత్వ సంపదను పరిరక్షిస్తున్నారు.
చెన్నూరు త్రికూఠ ఆలయం కూడా చాలా ప్రసిద్ధమైనది.
వానకొండయ్య లక్ష్మి నరసింహస్వామి ఆలయం అత్యంత మహిమాన్వితమైనది.
సన్నూరులో స్థానిక రెడ్డి, వెలమలు కలిసి 800 ఏళ్ల కింద వెంకటేశ్వర స్వామి కట్టారు. శివాలయం కూడా ఉంది. 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బాగు చేస్తున్నాం.
నా పెళ్లి కూడా అక్కడే జరిగింది.
వల్మిడి శ్రీరామ నవమి రోజున ప్రారంభం చేస్తున్నాం.
ప్రతి కుటుంబం నుంచి భార్యాభర్తలు రావాలి. కళ్యాణం చేయించాలి.
ఒంటిమిట్ట, భద్రాద్రికి సమానంగా ఈ ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నాం.
కలెక్టర్ శివ లింగయ్య గారి మాటలు…
జిల్లాకు వచ్చాక టూరిజం ప్రాజెక్టులు చేయాలని మంత్రి గారు చెప్పారు.
వాటికి డబ్బులు మంజూరు చేయించడం, పనులు వేగంగా చెయ్యించడం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
నెలలో చెట్లు పెట్టి ఈ ఆలయాలను అందంగా, పచ్చగా చేస్తున్నాం.
వీటిలో శివరాత్రికి పాలకుర్తి, శ్రీరామనవమి వాల్మీకి ఆలయాల్లో పండగ వాతావరణం తీసుకొస్తాం.
ప్రొఫెసర్ పాండు రంగారావు గారి మాటలు…
ఈ ఆలయాలు ఇంత అభివృద్ది కావడం, నేడు చూడడం చాలా ఆనంద దాయకం.
బమ్మెర లో పోతనకు 2010 లో 4 ఎకరాల 10 గంటల స్థలం కొన్నాం. దానికి మంత్రిగారు ఆనాడు లక్ష రూపాయలు ఇచ్చారు.అది పునాది అయ్యింది.
22 అడుగుల మంచి విగ్రహం తయారు అవుతుంది..పోతన ఉన్న స్థలం, దున్నిన భూమి, నీళ్ళు తోడిన బావి, ఆయన పూజించిన సరస్వతి మందిరం కూడా చేస్తున్నాం.
పాలకుర్తిని బ్రహ్మాండమైన పుణ్య క్షేత్రంగా మంత్రి గారు తీర్చి దిద్దుతున్నారు.
మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపోల్ దేశాయ్ జిల్లాకు సంబంధించిన దేవస్థానాలకు సంబంధించిన రాష్ట్ర జిల్లాస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నిపుణులు ఉన్నారు.