చిట్యాల మండలంలో బిజెపి భరోసా యాత్ర
Jayashankar Bhupalpallyబిజెపి భరోసా యాత్ర గడప గడపకు ప్రచారంలో భాగంగా చిట్యాల మండల బిజెపి అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిట్యాల మండలములోని ముచినీపర్తి, చల్లగరిగ, జుకల్ తిరుమలాపూర్,గ్రామాల్లో జరిగిన ప్రచారంలో పాల్గొన్న భూపాలపల్లి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి భూపాలపల్లి ఆడబిడ్డగా నీ ముందుకు వస్తున్న నన్ను ఆదరించండి,నేను గెలిస్తే భూపాలపల్లి కి రైల్వే లైన్ తీసుకొస్తా,
భూపాలపల్లి నియోజకవర్గం లో మహీళల మణులు కీర్తి రెడ్డి గెలుపు కోసం నడుం బిగించి పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు,రైతులకు అండగా బిజెపి ఉంటుంది, ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే వడ్లకు మద్దతు ధరగా 3100 చేస్తాము అని అన్నారు.
ఉచిత విద్య వైద్యం బిజెపి తోనే సాద్యం,ఉజ్వల యోజన పథకం కింద సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు.
ఇంట్లో ఉన్న వృద్ధులకు ఇద్దరికీ పింఛన్ ఇస్తం అని అన్నారు.నన్ను గెలిపించండి భూపాలపల్లి నియోజకవర్గంలో రాబందుల పాలనను అంతం చేస్తానని కీర్తి రెడ్డి అన్నారు,అంతేకాకుండా ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ కీ మారే దొంగలు మీ ఇంటి ముందుకు వస్తున్నారు కావున అందరూ తప్పకుండా అలోచించి న్యాయం వైపు ఉండే నాకు కమలం పువ్వు గుర్తుకే మీ ఓటు వేసి నన్ను గెలిపించాలని ఈ రోజు ఇద్దరు గండ్రలు బిఆర్ఎస్ పార్టీ కి సంబందించిన వ్యక్తులే అందరూ గుర్తు పెట్టుకోవాలి, సత్యనారాయణ రావు గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని ప్రజలందరూ ఆలోచించి ఓట్లు వేయాలని కీర్తి రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నాగపురి రాజమౌళి గౌడ్,వెన్నంపల్లి పాపన్న, సీనియర్ నాయకులు చెక్క నరసయ్య, కామిడీ నారాయణ రెడ్డి, భావు బుగులయ్య,పంచిక మహేష్,మాచర్ల రఘు,మహిళ నాయకులు ఉడుత వనక్క,పూర్ణ,వేణు,రమేష్, బూత్ అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్,దబెట్ శ్రీశైలం,సంగ రాజేందర్,పాలకుర్తి ప్రశాంత్,సుంకరి బాభన్న, కదం రాజు, బండర్ భద్రయ్య,ఆకుల శ్రీధర్,సుర శ్రీకాంత్, కుసుంబ సుదర్,జలిగపు ఓదెలు,స్వామి,అరెల్లి నరేష్,అశోక్,సారంగపాణి,అశోక్,సురేష్, గజనాల రవీందర్,తదితరులు పాల్గొన్నారు.