జనవరి 30న జరుగు మత్స్య కారుల జిల్లా సదస్సును జయప్రదం చేయండి.
Hanamkondaగొడుగు వెంకట్ జిల్ల్లా ప్రధాన కార్యదర్శి <<
ఈరోజు (Jan 23)న తెలంగాణ మత్స్య కారులు, మత్స్య కార్మిక సంఘం (TMKMKS) హనుమకొండ జిల్లా కమిటీ ఆద్వ్యర్యంలో జనవరి 30న జరుగు మత్స్య కారుల జిల్లా సదస్సు వాల్ పోస్టర్ ను కుమారుపల్లి చేపల మార్కెట్ లో అంబటి కుమారక్క అధ్యక్షతన ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ ఆవిష్కరణ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్ మాట్లాడుతూ.., జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో, గ్రేటారు వరంగల్ పరిధిలోని కార్పొరేషన్ డివిజన్ లలో అధునాతనమైన చేపల మార్కెట్ల నిర్మించాలని, అలాగే వరంగల్ మహానగరంలో 10 ఎకరాల స్థలం కేటాయించి రూ. 50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్‌ను నిర్మించాలని తీర్మానం చేయబోతున్నామని గొడుగు వెంకట్ తెలిపారు. మత్స్య కారులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కరించుకోవడానికి ఒక వేదికగా ఈ జిల్లా సదస్సు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మత్స్య సోసైటికి 10 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించేందుకు, వచ్చే బడ్జెట్ లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్య కారుల సంక్షేమం కోసం రూ.5000ల కోట్లు కేటాయించాలని, 50 సం,,రాల నిండిన మత్స్యకారులకు 5 వేల రూపాయలు పించను ఇవ్వాలని, ఈ సదస్సులో తీర్మానం చేయనున్నామని తెలిపారు. ఇందుకోసం జనవరి 30న ఉదయం 11 గంటలకు హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో జరుగుతున్నా జిల్లా సదస్సుకు పెద్ద సంఖ్యలో అన్ని మత్స్య సోసియేటీలు భాగస్వాములై జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా *ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ వెస్ట్ నియోజవర్గ శాశనసభ్యులు శ్రీ దాస్యం వినయభాస్కర్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు MLC శ్రీ బాండ ప్రకాష్ గారు *, ముఖ్య వక్తలుగా *AIFFWF జాతీయ కార్యదర్శి లేల్లెల బాలకృష్ణ గారు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ బుస్స మల్లేశం గారు, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ CH.దినేష్ కుమార్ గారు . అతిధులుగా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మైన్ శ్రీ బండి సారంగపాణి గారు *, *ధర్మసాగర్ ZPTC శ్రీ పిట్టల శ్రీలత గారు *, *మాజీ సైనికాధికారి కల్నల్ DR .మాచర్ల బిక్సపతి గారు, ప్రముఖ వైద్యులు DR. కొత్తగట్టు శ్రీనివాస్ గారు *, *45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు గారు, 27వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ చింతకుల అనిల్ కుమార్ గారు *, *కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు DR. గుండాల మదన్ కుమార్ గారు, రిటైర్డ్ లెక్చరర్ శ్రీ డోలి రాజలింగం గారల తో పాటు తదితర ప్రముఖులు అతిధులుగా హాజరై మత్స్య కారుల సమస్యలపై ప్రసంగిస్తారని వెంకట్ తెలిపారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల విజేందర్, జిల్లా నాయకులు కుమారక్క, వెంగళ సమ్మక్క, సమ్మక్క, సురేందర్, స్వామి, చంద్రగిరి అనితాదేవి, మిట్టపల్లి ఉపేంద్ర, లాడే విజయ, పిట్టల సక్కమ్మ, ఊదర సంబళష్మి, పులి మాధవి, ఉడుతలా సరోజన, ఇప్ప సుధీర్, ఇప్ప వరమ్మ, బోయి ణీ సమితి, దాసరి మంజుల, రేగుల పుషక్క, మట్టపల్లి శోభా, సాల్వాయి సంబళష్మి, కొండా హైమ, వడ్డేపల్లి లక్షిమి, మట్టపల్లి సరోజన, మట్టపల్లి లక్ష్మి, మట్టపల్లి శోభా తదితరులు పాల్గొన్నారు.