ఆశ్రిత భక్త వత్సలుడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ కల్పవృక్ష నారసింహ స్వామి వారు ఈనాడు నూతన సింహాసనం పైన అత్యంత విశేషంగా ఆ దివ్య దంపతులు మనకు దర్శనమిస్తున్నారు. భగవత్ బంధువులు అందరి సహకారంతో తయారైన నూతన సింహాసనానికి ఈరోజు ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని అందులో కొలువు తీర్చడం జరిగింది. మన నృసింహ భక్త కుటుంబం ఏది సంకల్పం చేసిన అది స్వామి కైంకర్యం అయిన లేదా సమాజ సేవలో అయిన నిత్యాన్న ప్రసాద వితరణ లో ఇలా ప్రతి ఒక్క విషయంలో అండగా ఉంటూ ఎన్నో అద్భుత కైంకర్యాలు నిర్వహిస్తుంది. ఈ కైంకర్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి గోత్ర నామాలు కూడా ఈరోజు జరిగిన హోమం అభిషేకం లో సంకల్పం చేయడం జరిగింది.