బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులను ఎప్పటికీ మరవకూడదని వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు.అనంతరం వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, రామలింగారెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి కుటుంబ సభ్యులు, స్కూల్ యాజమాన్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.