రఘునాథపల్లి / తెలుగు గళం న్యూస్ /నూతనంగా ఎన్నికైన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ను కాంగ్రేస్ పార్టీ మండల నాయకులు హైదారాబాదులో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్లు జిల్లా ఎన్ఎసుఐ మాజీ అధ్యక్షులు బోనాసీ శ్రీకాంత్, జనగాం జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు కీసర దిలీప్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు గొల్లూరి పృద్వీలు పీసీసీకి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రఘునాథపల్లిలోని గ్రామాల అభివృద్ధి కోసం తన కృషి చేయాలని కోరడంతో మహేష్ కుమార్ సానుకూలంగా స్పందించాడని వారు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో లింగాల గణపురం యూత్ అధ్యక్షుడు చిటకోరు సంపత్, స్టేషన్గన్పూర్ యూత్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, లక్కిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మాణిక్యపురం విజయ డైరీ చైర్మన్ రాగం నారాయణ, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, ఎన్ఎస్ యు ఐ మండల అధ్యక్షులు కొమ్మ గొల్ల రాకేష్, యూత్ నాయకులు జానీ, మద్దూరి శ్రీకాంత్, ఎండి ఆ బాస్ తదితరులు పాల్గొన్నారు