ఈ69న్యూస్ నర్సింహులపేట:-మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లోక్యతండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు శ్రీనివాస స్వామి ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శశాంక మౌఖికంగా ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని లోక్య తండాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పర్యవేక్షణలో మరియు రిజిస్టర్ లో విద్యార్థుల హాజరు శాతమును, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస ను పలు వివరాలను కలెక్టర్ అడిగారు. పర్యవేక్షణ , రిజిస్టర్ లో విద్యార్థుల హాజరు శాతం, తరగతి వారీగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకోవడంతో, సరైన సమాధానం చెప్పకపోవడం, నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసను సస్పెండ్ చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.4.35 లక్షలను పనులను సక్రమంగా చేయకపోవడంతో రికవరీ చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి ను జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.