సూర్యాపేట జిల్లా,కోదాడ.అనంతగిరి మండలం వెంకట్రాంపురం లోనే డంపింగ్ యార్డ్ తొలగించాలని గ్రామస్తుల ధర్నా నిర్వహించారు.కోదాడ మున్సిపాలిటీలో చెత్త ఇక్కడ పోయాడంతో కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులకు విన్నవించిన్నా ఫలితం లేదని ఆరోపించారు డంపింగ్ యార్డ్తొలగించే వరకు ధర్నా విరమించేది లేదని అన్నారు.గత కొంతకాలంగా డంపింగ్ యార్డ్ వలన గ్రామస్తులు అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నామని డంపింగ్ యార్డ్ లో చెత్తకు నిప్పు పెట్టడం వలన దాని నుండి వెలువడే పొగ కాలుష్యమై పొలాలకు సాగునీరు,తాగునీరు కలుషితమై రకరకాల వ్యాధులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ మా గ్రామం నుండి తొలగించక పోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని వారు డిమాండ్ చేశారు.