డబల్ బెడ్ రూమ్ ఏసి రెడ్డి నగర్ కాలనీలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలి
JangaonTable of Contents
Toggleమోకు కనకా రెడ్డి సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి
మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా
జనగామ: జనగామ పట్టణ ము లోనీ 30వార్డుల లో ఉన్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలి అని సిపిఎం జనగాం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జనగామ మున్సిపాలిటీ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ మేనేజర్ రాములు గారికి వివిధ డిమాండ్లతో కూడినటువంటి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథిగా సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జనగామ పట్టణం లో 5వ వార్డు డబల్ బెడ్ రూమ్ ఏసి రెడ్డి నగర్ లో పారిశుధ్య సమస్యపై స్థానిక మున్సిపాలిటీ శానిటేషన్ ఎస్ఐ కి అనేక సందర్భాలలో పారిశుద్ధ్య సమస్యపై దృష్టికి తీసుకుపోయిన కాలనీ కచ్చ డ్రైనేజీ నిండిపోయి రోడ్డుమీదికి నీళ్లు వచ్చి గుంతలు గుంతలుగా మారిపోయింది ఆ గుంతలలో నీళ్లు నిలిచి టూ వీలర్ వెహికల్ జారీ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి నీళ్లను రోడ్డు మీదకి రాకుండా కచ్చ డ్రైనేజీ ఎప్పటికప్పుడు తీస్తే ఈ ప్రమాదాలు జరిగాయి అని అన్నారు. బజారులు ఉండవడం లేదు ఏక్కడీ చెత్త అక్కడనే ఉన్నది. దీని ద్వారా అనేకమైన దోమలు మరియు పురుగులు వస్తున్నాయి కాబట్టి తక్షణమే కమిషనర్ గారు శాంటేషన్ ఎస్సై పై జవాన్ పై చర్యలు తీసుకొని ఐదో వార్డ్ లో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఎ సి రెడ్డి కాలనీకి 92 లక్షల రూపాయలు వచ్చాయని అధికారులు కాలనీకి వచ్చి ప్లాన్ గీశారు కానీ పని ప్రారంభం కాలేదు ఎందుకు అని ప్రశ్నించారు..?. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్డు వాటర్ ట్యాంక్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. పారిశుధ్య సమస్యను గనుక పరిష్కరించకపోతే మున్సిపల్ ముట్టడి చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్. సిపిఎం సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్. జిల్లా కమిటీ సభ్యులు. సుంచు విజేందర్. ఎండి అజారుద్దీన్. పట్టణ కమిటీ సభ్యులు. కళ్యాణం లింగం. పందిళ్ళ కళ్యాణి. శాఖ కార్యదర్శి చీర రజిత కొండ వరలక్ష్మి గాడి సుభాషిని గుంటీపల్లి బాలు పల్లెర్ల శంకర్ గుండె మల్లేష్ రాగల్ల అంజయ్య సిద్ధిరాల ఉపేందర్ ఎర్ర అనిత చనిగేచర్ల శిరీష . కళ్లెపు కుమార్. మేడ ఆనందం సుకన్య మానస తదితరులు పాల్గొన్నారు.