తురక కాశోల్ల TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ వలి
Hanamkondaతురక కాశోల్లకు ప్రభుత్వం ఆదుకోవాలి. – ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి,రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయాలి. – టి.కే.ఎస్.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి. .. హన్మకొండ మార్చి 06 . తెలంగాణ రాష్ట్రంలో తురక కాశోల్లు 5లక్షల జనాభా ఉన్నారు.వీరంత అత్యంత వెనుకబడిన కులాల్లో ఒకటిగా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదని తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కొండలలో ,గుట్టలలో చిన్నచిన్న గుడారాలు వేసుకొని బండలు కొట్టడమే జీవన వృత్తిగా చేస్తూ వందల సంవత్సరాలుగా విద్య వైద్యం,కూడు,గూడు, ఇలా కనిస వసతులు సరిగా అందడం లేదని తెలిపారు.వీరంత సామాజిక, ఆర్థికంగా వెనుకబడి అట్టడుగున ఉన్నారన్నారు. ఇప్పటి వరకు తమ కాశోల్లకు ప్రభుత్వం నుండి ఏ ఒక్క చిన్న సహాయం అందకపోవడం తీవ్ర వివక్షకు గురవుతున్నట్టు స్పష్టమవుతుందన్నారు. గత 5 సంవత్సరాలుగా తమను గుర్తించి, ఆర్థిక,విద్య వైద్యం, ఇలా తమ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అనేక వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. అయినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర బాధ కలిగించిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి తమకు గుర్తించి వడ్డెర ఫెడరేషన్ లాగా తమకు ప్రత్యేక తురక కాశ ఫెడరేషన్ ఏర్పాటు చేసి, 200 కోట్ల నిధులు మంజూరు చేసి తమ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని సయ్యద్ వలి డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలతో నిరసన కార్యక్రమాలకై ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.