ధర్మసాగర్ తెలుగు గళం సెప్టెంబర్ 24న్యూస్ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చిట్యాల లక్ష్మణ్ కుమారుడు చిట్యాల అరవింద్(20) నిన్న అనగా సోమవారం సాయంత్రం కరెంట్ షాక్ తో మరణించగా తోటి ఆటో డ్రైవర్లు లక్ష్మణ్ ని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆటో డ్రైవర్ లక్ష్మణ్ కుటుంబానికి మేమున్నామంటూ ముందుకు వచ్చి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.