---- . ---ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు వినతి పత్రం అందజేసిన నాయకులు తల్లాడ డిసెంబర్ 1;ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అమలు చేయాలనిటి యు డబ్ల్యూ జే. ఐజేయు దళిత బంధు కమిటీజిల్లా lకన్వీనర్సైదులు. కో కన్వీనర్ చెరుకుపల్లి.శ్రీనివాసరావు కోరారు. ఈ సందర్భంగా సత్తుపల్లిఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దళిత బంధు పథకమును దళిత జర్నలిస్టులకు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులకు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి అమలు చేయాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య మాట్లాడుతూ ,దళిత బంధు పథకం కింద జర్నలిస్టులకు దళిత బంధు రుణం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టి యు డబ్ల్యు జె ఐజేయు జిల్లా నాయకులు నామా పురుషోత్తం, సిహెచ్ శ్రీనివాసరావు, మేడి రమేష్, విజయ్,నాయకులు తడికమల్ల దేవదానం, ఉబ్బెన ప్రభాకర్, మోదుగుజయరాజు,గురవయ్య,రాజు, తదితరులు పాల్గొన్నారు.