E69news స్టేషన్ ఘన్ పూర్ విద్యార్థుల భోజనం, విద్యా బోధన పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే టి రాజయ్య హెచ్చరించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం లోని జ్యోతిరావు పూలే గురుకుల విద్యార్థులు మెనూ అమలు చేయడం లేదని గురువారం విద్యార్థులు హైవేపై ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గురుకుల పాఠశాలను సందర్శించారు. హాస్టల్, డైనింగ్ హాల్, వంట గదులు రెసిడెన్షియల్ పరిసరాలను వంటలను పరిశీలించిచేశారు.సంబంధిత స్పెషల్ అధికారి మల్లయ్య ప్రవర్తన బాగోలేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే స్పెషల్ అధికారి మల్లయ్య పై డిప్యూటీ వార్డెన్ రాజేష్ పై కూడా శాఖపరమైన చర్యలు కై అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భోజనం, డారుమెంటరీ, స్టడీస్ విషయంలో ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు ఉదాసీన వైఖరి అవలంబించకూడదని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో కృష్ణవేణి, జ్యోతిరావు పూలే గురుకులాల వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ రాంరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ తహసీల్దార్ పూల్ సింగ్ చౌహన్, జనగామ జిల్లా జ్యోతిరావు పూలే గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ అనిత తదితరులు ఉన్నారు.