గత మూడు రోజులుగా వరంగల్ నగరంలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నీట మునిగిన 35వ డివిజన్ మైసయ్య నగర్ 43 డివిజన్ లక్ష్మీపురం సిపిఎం కాలనీ 32 డివిజన్ మల్లు లక్ష్మీ నగర్ ప్రాంతాలను సందర్శించిన అనంతరం వరద బాధితులు,కాలనీవాసులతో మాట్లాడిన సిపిఎం బృందం అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నలిగంటి రత్నమాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారం బాబు మాట్లాడుతూ గుడిసె వాసులందరికీ పట్టాలిచ్చి పక్క గృహాలను నిర్మించాలని వరదల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకు 25 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని వారిని సహాయక కేంద్రాలకు తరలించి ఆహారం అందించి దుప్పట్లోను పంపిణీ చేయాలని పేదలేసుకున్న గుడిసెల్లో మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం కోసం ముందస్తు చర్యలు చేపట్టలేదని వాపోయారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆరూరి కుమార్ సిపిఎం రంగసాయిపేట్ ఏరియా కమిటీ సభ్యులు ధర్మారం సాంబమూర్తి కిలా వరంగల్ సభ్యులు దుర్గయ్య ఉదయ్ సిపిఎం నాయకులు బాబు తోట మల్లయ్య సింగారం ప్రకాష్ తాటిపాముల ఉదయశ్రీ తాత స్వాతి దురిశెట్టి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.