జీలుగుమిల్లి మండల కేంద్రం ప్రధాన జగదాంబ దేవాలయం సెంటర్లో ప్రమాదం పొంచి ఉంది ఉందని సిపిఎం జీలుగుమిల్లి కార్యదర్శి ఎన్విఅప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు శనివారం ఆయన ప్రకటన విడుదల చేస్తూ గత 15 రోజుల క్రితం వర్షాలకు ముందు గ్రామంలో ఏర్పడిన మంచినీటి సమస్య పరిష్కారానికి తీసిన గొయ్య పోర్చటానికి పంచాయతీ మీనమేషాలు లెక్కిస్తుంది రాత్రి సమయంలో పగటిపూట ట్రాఫిక్కు సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని పాదచారులు ద్విచక్ర వాహనదారులు బిక్కుబిక్కుమంటున్నారు అని ఆయన తెలిపారు బ్యాంక్ ఆఫ్ బరోడా రోడ్ మరికొన్నిచోట్ల వీధిలైట్లు నెలలు తరబడి వెలగడం లేదు వాటిని వేసేందుకు గత 15 రోజులకు వర్షాల వంకతో పట్టించుకోలేదు వర్షాలు ఆగిన తర్వాత పట్టించుకోవటం లేదు పంచాయతీ నిర్లక్ష్యానికి ఈ రెండు సమస్యలు మచ్చుతునకలు మాత్రమే ఇక పారిశుధ్యం చెప్పునక్కర్లేదు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలి అప్పారావు డిమాండ్ చేశారు.